/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ktr-revanbt-jpg.webp)
అందరికంటే ముందు అభ్యర్థులను ఖరారు చేసింది, బీ ఫార్మ్ లు ఇచ్చింది, ప్రచారంలో ఉన్నది బీఆర్‌ఎస్‌నేనన్నారు మంత్రి కేటీఆర్. లాస్ట్ టైం ఖమ్మంలో మాకు లీడర్లు ఎక్కువ ఉన్నారని.. అయినా ఒక్కటే సీటు వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. ఈ సారి లీడర్లు అందరూ వెళ్లారని.. సీట్లు ఎక్కువ వస్తాయని.. లీడర్లు వెళ్లినంత మాత్రాన ఓటర్లు మారరన్నారు. అప్పుడు కూడా సీ ఓటర్ సర్వే మా పార్టీ రాదని చెప్పిందని.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాస్ట్ టైం కూడా గడ్డానికి కలర్ వేసుకుని రెడీ అయ్యాడు కానీ జనాలు వారికి ఓటు వేయలేదని కౌంటర్లు వేశారు. కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఆరుగురు దొరికారని.. కానీ ఓటర్లు దొరకడం లేదని వెటకారంగా మాట్లాడారు కేటీఆర్.
Also Read: ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!
చిట్‌చాట్‌లో కేటీఆర్ ఏం అన్నారంటే?
➼ మళ్ళీ గెలుస్తున్నాం.
➼ లాస్ట్ టైం 88 సీట్లు వచ్చాయి.
➼ ఇప్పుడు అంతకు మించి వస్తాయి.
➼ కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులు లేరు.
➼ కాంగ్రెస్ కు వారి చరిత్రనే గుదిబండ.
➼ నియామకాలకు అడ్డం పడేది కాంగ్రెస్.
➼ సంవత్సరానికి 13 వేల ఉద్యోగాలు నియామకం చేశాం.
➼ రాహుల్ గాంధీ అజ్ఞాని.
➼ 30 మెడికిల్ కాలేజీలు పెట్టిన మేం ఎక్కడ, ముష్టి 30 కాలేజీలు పెట్టిన మీరెక్కడ?
➼ ఫ్లోరోసిస్ శాపం ఇచ్చిందే కాంగ్రెస్.
➼ ఫ్లోరోసిస్ రూపుమాపింది బీఆర్ఎస్.
➼ కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం కట్టింది కేసీఆర్.
➼ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 5గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు.
➼ ఛత్తీస్‌గఢ్‌లో పవర్ హాలిడేస్ ఇస్తుంది నిజం కాదా?
➼ బీజేపీ నేతలు యుద్ధానికి ముందే చేతులు ఎత్తేశారు.
రేవంత్ ఇలా ఎలా చేస్తాడు?
సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అని రేవంత్ అన్నాడంటూ విమర్శలు చేశారు కేటీఆర్. TSPSC ఉద్యోగాలు ఆపడానికి కోర్టుకు వెళ్ళింది ఈ కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో అలా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. ముదిరాజులను క్యాబినెట్ లోకి తీసుకుంది కేసీఆర్ ,రాజ్యసభలో అవకాశం ఇచ్చింది, MLC మండలి వైస్ చైర్మన్ ఇచ్చింది కూడా కేసీఆరేనన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్థి, ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. మోదీ వచ్చి తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతారని. గుజరాత్‌కి బానిస కిషన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఢిల్లీకి బానిస రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఈ సారి పోటీ చేయడానికి కిషన్ రెడ్డి ,బండి సంజయ్ భయపడుతున్నారన్నారు. బండి సంజయ్ ఏ దేశానికి స్టార్ క్యాంపెయినరో చెప్పాలన్నారు. బండి సంజయ్ కి హిందీ రాదు, తెలుగు కూడా సరిగ్గా రాదంటూ ఆరోపించారు కేటీఆర్. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అంటారు.. కానీ ఒకే కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చి కాంగ్రెస్ లీడర్లను ముంచుతారన్నారు.
Also Read: నవంబర్‌లోనైనా చంద్రబాబుకు రిలీఫ్ దక్కేనా? 8న క్వాష్ తీర్పు? – తెలకపల్లి రవి