/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/revanthh-jpg.webp)
తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. ఇప్పుడు కాంగ్రెస్(Congress) ఆ పని చేయనుంది. 58 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్ ఇవాళ విడుదల చేయనుంది. నిన్న ఢిల్లీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఆమోదించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు అక్టోబర్ 17 లేదా 18న మరోసారి ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుందని తెలుస్తోంది. అక్టోబర్ 19 నాటికి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ప్లాన్‌లో ఉంది కాంగ్రెస్. మరోవైపు RTV చేతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్ల జాబితా ఉంది. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నరికేకల్ నుంచి వేముల వీరేశం లాంటి వారు ఈ లిస్ట్‌లో ఉన్నారు.
వివరాల కోసం కింద లింక్ చేసిన ఆర్టీవీ(RTV) వీడియో చూడండి.
అయితే ఈ మొదటి విడత జాబితాలో గతంలో పోటీ చేసిన వారి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాలో ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంద కాంగ్రెస్. ఈ నెల 18 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు రెడీ అవుతోంది. హస్తం సీనియర్ నేతలు బస్సుయాత్ర చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని సమాచారం. రాహుల్, ప్రియాంక గాంధీ అక్టోబర్ 18న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి బస్సు యాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కొండగట్టు నుంచి జగిత్యాల వరకు రాహుల్, ప్రియాంక రోడ్ షోలో పాల్గొననున్నారని తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పర్యటిస్తుంది.
ALSO READ: చంద్రబాబుకు జైలులో ఏసీ.. ఏసీబీ జడ్జి సంచలన ఆదేశాలు
Follow Us