TS Congress: 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. ఆ ముఖ్య నేతలకు షాక్?

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. 55 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఏఐసీసీ ఫైనల్ చేసిన ఈ లిస్ట్‌ను విడుదల చేశారు.

New Update
TS Congress: 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. ఆ ముఖ్య నేతలకు షాక్?

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. ఇప్పుడు కాంగ్రెస్‌(Congress) ఆ పని చేసింది. 55 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో ఊహించిన విధంగానే ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి-కొడంగల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి- హుజూర్ నగర్, నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందోలు-దామోదర్ రాజనర్సింహ, జగిత్యాల-జీవన్ రెడ్డి, మంచిర్యాల-ప్రేమ్ సాగర్ రావు, అలంపూర్-సంపత్ కుమార్, కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు, ములుగు-సీతక్క, మధిర-భట్టి విక్రమార్క సీట్లు ఉన్నాయి. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ కు టికెట్ లభించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి, వేముల వీరేశంకు నకిరేకల్, మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ కు టికెట్ దక్కింది. బీజేపీ నుంచి వచ్చిన వినయ్ రెడ్డికి ఆర్మూర్ టికెట్ లభించింది.

publive-image ఫస్ట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారో చూడండి

publive-image ఫస్ట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారో చూడండి

ఫస్ట్ లిస్ట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం రెండు సీట్లను మాత్రమే ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సారి తన సిట్టింగ్ స్థానం మధిర, పోదెం వీరయ్య మరో సారి తన సిట్టింగ్ స్థానమైన భద్రాచలం నుంచే టికెట్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం సీటును సీపీఎంకు ఇస్తారన్న ప్రచారానికి చెక్ పడింది. అయితే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ల పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం వారి వర్గీయులను షాక్ కు గురి చేసింది. అయితే.. ఈ ఇద్దరు నేతలు పాలేరు టికెట్ కోసమే పట్టుబట్టడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరుల పేర్లు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడంతో ఆయన వర్గం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సెకండ్ లిస్ట్ లో పొంగులేటితో పాటు ఆయన అనుచరుల పేర్లు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ మరో సారి రెండు టికెట్లను దక్కించుకుంది. ఆయన హుజూర్ నగర్ నుంచి మరో సారి భరిలోకి దిగుతుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ లభించింది.

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో ఎవరున్నారో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

లిస్ట్‌లో ఎవరు ఉన్నారో చూడాలంటే కింద వీడియో చూడండి.

(THIS IS AN UPDATING STORY)

Advertisment
Advertisment
తాజా కథనాలు