TS Elections 2023: కామ్రేడ్ల పీఠముడి.. లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు.. తల పట్టుకున్న కాంగ్రెస్!

లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీట్ల విషయంలో సీపీఎం, సీపీఐ పట్టుపడుతోంది. రెండు స్థానాలను కచ్చితంగా కావాలని సీపీఎం డిమాండ్‌ చేస్తుండగా.. ఏం చేయాలన్నదానిపై హస్తం నేతలు తర్జనభర్జన పడుతున్నారు.

New Update
TS Elections 2023: కామ్రేడ్ల పీఠముడి.. లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు.. తల పట్టుకున్న కాంగ్రెస్!

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ఓవైపు పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా.. పొత్తుల విషయంలో కాంగ్రెస్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
కామ్రేడ్లతో కాంగ్రెస్‌ పొత్తుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.. సీపీఎం, సీపీఐ కీలక స్థానాలను డిమాండ్‌ చేస్తుండడంతో హస్తం నేతలకు ఏం చేయాలో అర్థంకావడంలేదు. లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే విషయమని ఓవైపు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు లెఫ్ట్ పార్టీ నేతలు కీలక స్థానాలను అడుగుతున్నారు. తాము అడిగింది ఇవ్వకపోతే పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. సీపీఎం ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది.

తల పట్టుకున్న కాంగ్రెస్:
మరోవైపు కాంగ్రెస్‌ తుది జాబితాపై ఫైవ్ మెన్ కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మురళీధరన్ కామ్రేడ్లకు ఇవ్వాల్సిన సీట్ల విషయంపై చర్చిస్తున్నారు. సీపీఎంతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు కొనసాగుతోన్నాయి. అటు రెండు సీట్లకి తగ్గేది లేదంటోంది సీపీఎం. రెండు స్థానాలను కచ్చితంగా డిమాండ్ చేస్తోంది. సీపీఎం బాటలో సీపీఐ కూడా నడుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికైనా అంగీకరిస్తే కలిసి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. కీలక సీట్లు అడగడంతో కాంగ్రెస్‌ ఏం తేల్చుకోలేని స్థితిలో ఉంది. సీపీఎంను కూడా కలుపుకొని పోతేనే కాంగ్రెస్ పార్టీకి మంచిదని రాష్ట్ర నేతలు కూడా సూచిస్తున్నారు.

ఇక ఇప్పటికే సీపీఎం తన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ‌తో పొత్తు కోసం సీపీఎం ప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు. మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సీపీఎం కాంగ్రెస్‌ను కోరింది. కానీ హస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా 14 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి Vs పొంగులేటి.. తుంగతుర్తి, సత్తుపల్లి, పటాన్ చెరు, సూర్యాపేట టికెట్లపై లొల్లి!

Advertisment
తాజా కథనాలు