Breaking: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. కర్ణాటకలో ఆ కీలక నేత డబ్బేనా?

ఎన్నికల సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఏఎంఆర్‌(AMR)సంస్థ మహేశ్‌ రెడ్డి నుంచి మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కర్ణాటకలో ఓ కీలక నేతకు మహేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Breaking: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. కర్ణాటకలో ఆ కీలక నేత డబ్బేనా?

హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏఎంఆర్‌(AMR)సంస్థ మహేశ్‌ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. కర్ణాటక కీలక నేతకు బినామీగా AMR సంస్థ మహేశ్‌ రెడ్డి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేస్తోంది.

ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం పొరుగు రాష్ట్రం నుంచి ఈ డబ్బును తీసుకువచ్చినట్లు సమాచారం. ఇక ఇలా ఐటీ దాడుల్లో డబ్బులు పట్టుపడడం ఇది తొలి సారి కాదు. ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో హైదరాబాద్ లో రూ.14.7 కోట్లను గుర్తించింది.బెంగళూరు మాజీ కార్పొరేటర్, ఆమె కాంట్రాక్టర్-భర్త నివాసంలో జరిగిన సోదాల్లో రూ.42 కోట్లు లభించాయి. ఈ డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంగ్రెస్ ఉపయోగిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి డబ్బులు పంపుతోందని మంత్రి కేటీఆర్‌ కూడా ఆరోపిస్తున్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన వారి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారంటూ రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు.

ఎలాంటి డాక్యుమెంట్స్ లేని డబ్బులను పోలీసులు సీజ్‌ చేసి ఐటీశాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసులు తనిఖీలు పెరిగాయి. చెక్‌ చేసే కొద్దీ కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నగదు ఎక్కువగా కర్ణాటక నుంచే వస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్నద కాంగ్రెసే కాబట్టి.. ఈ డబ్బంతా కాంగ్రెస్‌కి సంబంధించిందేనని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుండగా.. కారు పార్టీ నేతల వ్యాఖ్యలను హస్తం నేతలు కొట్టిపడేస్తున్నారు.

Also Read: వచ్చే ఎన్నికల్లో `మోదీ గ్యారంటీలు' అక్కరకు వస్తాయా? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు