TS Elections 2023: కేసీఆర్‌కు షాక్‌.. సీఎంపై పోటీకి 120మంది..!

ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌కు బిగ్‌ షాక్ ఇచ్చారు కామారెడ్డి రైతులు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అందులో కామారెడ్డి ఒకటి. ఇక్కడ నుంచి అసెంబ్లీ బరిలో రైతులు నామినేషన్లు వేయనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు సమావేశం అయ్యారు. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

New Update
TS Elections 2023: కేసీఆర్‌కు షాక్‌.. సీఎంపై పోటీకి 120మంది..!

తన బ్రెయిన్‌లోని అస్త్రశస్త్రాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్‌కే గట్టి షాక్‌ ఇచ్చే ప్లాన్‌ ఇది. ఆయనపై ఏకంగా 120మంది పోటీకి నిలపడనున్నారని సమాచారం. ఈ సారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయనున్న కేసీఆర్‌కు.. కామారెడ్డిలో చెక్‌ పెట్టాలని మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి మాస్టర్‌ ప్లాన్‌ వివాదం రావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కామారెడ్డి అసెంబ్లీ బరిలో రైతులు నిలపడనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు సమావేశం అయ్యారు. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితుల హెచ్చరిస్తున్నారు. ఇక రైతుల నామినేషన్లతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

తగ్గేదే లే:
మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయకుంటే ఎంత దూరమైన వెళ్తామని రైతులు చెబుతున్నారు. మీటింగ్‌లో అందరి గ్రామాల రైతుల అభిప్రాయాలను సేకరించారు. తమ భూములను కాపాడుకోవడమే తమ లక్ష్యమని చెబుతున్నారు రైతులు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసిన తర్వాతే కేసీఆర్‌ కామారెడ్డిలో అడుగుపెట్టాలని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మాస్టర్‌ ప్లాన్ మంటలు రాష్ట్రవ్యాప్తంగా సెగలు రేపాయి. రైతులు చేసిన నిరసనలు ఉద్రిక్తలకు దారి తీశాయి. కామారెడ్డిలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పారిశ్రామిక జోన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వందలాది ఎకరాలను బదలాయించే మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం మరోసారి తెరపైకి రావడంతో ఈ ఇష్యూని కేసీఆర్‌ ఎలా డీల్ చేస్తారన్నదానిపై అందరి చూపు పడింది.

కవితపై కూడా ఇలానే చేశారు:
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌ కూతురు కవితకు నిజామాబాద్‌ పసుపు రైతులు షాక్ ఇచ్చారు. పసుపు బోర్డు తీసుకురావడంతో కవిత విఫలమయ్యారంటూ ఆమెకు వ్యతిరేకంగా 180 మంది రైతులు నామినేషన్‌ వేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపూరి అరవింద్‌ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు. రైతులు వ్యతిరేకించడంతోనే కవిత ఓడిపోయారన్నది విశ్లేషకులు మాట. ఇప్పుడు కేసీఆర్‌ విషయంలోనూ అదే జరుగుతుందానన్న ఉత్కంఠ నెలకొంది.

(THIS IS AN UPDATING STORY)

Advertisment
Advertisment
తాజా కథనాలు