MODI tour Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఢిల్లీ పెద్దల ఫొకస్ ఎక్కువగా రాష్ట్రంపైనే ఉంది. వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీల పెద్దలు ఇప్పటికి చాలాసార్లు తెలంగాణలోని బహిరంగ సభలకు వచ్చారు. కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక లాంటి టాప్ లీడర్లు ఇప్పటికే కార్యకర్తల్లో కొత్త ఉత్సహం నింపగా.. బీజేపీ నుంచి అమిత్‌షా లాంటి బడా నేతలు కమల సపోర్టర్స్‌ని ఉత్తేజపరిచారు. ఇప్పుడు ప్రధాని మోదీ వంతు వచ్చింది. తెలంగాణకు అక్టోబర్‌లో మోదీ రానున్నారని తెలుస్తోంది.
ఎప్పుడంటే?
అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణకి ప్రధాని మోదీ రానున్నారు. మహబూబ్‌నగర్, నిజమాబాద్‌ల్లో జరిగే బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు. నిజామాబాద్‌లో రోడ్ షో ఉండే అవకాశముంది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ఏదో ఒక రోజు వచ్చే ఛాన్స్ ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు మోదీ.
ALSO READ: చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దలు? ఇప్పటివరకు నోరు విప్పని కమలనాథులు!
సఖ్యత లేదు?
మరోవైపు తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదన్న ప్రచారం జరుగుతోంది. హైకమాండ్‌కి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతోనే బండి సంజయ్‌ని తప్పించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డని నియామించారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా సీనియర్లు కలిసికట్టుగా పని చేయడంలేదన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇదే విషయంపై పార్టీ సీనియర్లకు క్లాస్ పికారని సమాచారం. ఐక్యంగా లేకపోతే గెలవలేమని.. అందరూ కలిసి ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. నిన్న(సెప్టెంబర్ 16) హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా..వరుస పెట్టి రెండుసార్లు మీటింగ్ పెట్టారు. నిన్న బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అవ్వగా.. ఇవాళ(సెప్టెంబర్ 17) కూడా సమావేశం అవ్వడంపై చర్చనీయాంశమవుతోంది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటున్న బీజేపీ చేస్తున్న పొరపాట్లే ఆ పార్టీ ఎదగకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి వ్యక్తి వచ్చినా కళ్లు మూసుకుని కండువా కప్పేసే స్థాయి నుంచి.. పార్టీలో చేరతామంటే వద్దని బ్రేకులు వేయడమే కాదు.. పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాయకులకు నో జాయినింగ్ అని చెబుతుండడంతో తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
ALSO READ: పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వానిదే.!