TS Elections 2023: ఆ నియోజకవర్గాల్లో 90 శాతం దాటిన పోలింగ్.. ఎవరికి అనుకూలం?

తెలంగాణలో పోలింగ్ శాతం ఫైనల్ లెక్కలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అనేక స్థానాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మునుగోడులో 91, పాలేరులో 90 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలమనే చర్చ జోరుగా సాగుతోంది.

New Update
TS Elections 2023: ఆ నియోజకవర్గాల్లో 90 శాతం దాటిన పోలింగ్.. ఎవరికి అనుకూలం?

తెలంగాణలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తుది లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 71.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల ప్రధానాధికారి వికస్ రాజ్ తెలిపారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు అధికారులు. సూర్యాపేటలో 85.99 శాతం పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్ జిల్లా ఎప్పటిలాగే పోలింగ్ లో వెనకబడింది. ఈ జిల్లాలో కేవలం 46.68 శాతం ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 59.95 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Equal Votes: ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే ఏమవుతుంది? రాజ్యాంగం ఏమి చెబుతోంది

నియోజకవర్గాల వారీగా పోలింగ్ ను పరిశీలిస్తే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్న మునుగోడులో పోలింగ్ శాతం 91 నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో 90.28 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే.. అత్యధిక పోలింగ్‌ చోట ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే ప్రచారం సాగుతోంది. పోలింగ్‌ శాతం ఆధారంగా గెలుపుపై పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

అభ్యర్థులు సైతం గెలుపోటముల అంచనాల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్, కామారెడ్డిలో గెలుపోటములపై జోరుగా చర్చ సాగుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి అన్న అంశంపై సైతం పోలింగ్ శాతం ఆధారంగా గెలుపోటములపై చర్చ సాగుతోంది. కౌంటింగ్ రోజు నాడే పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారిందనే అంశంపై క్లారిటీ రానుంది.

Advertisment
తాజా కథనాలు