ఉద్యమాలకు కేరాఫ్ అయిన కరీంనగర్ జిల్లాలో ఈ సారి ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ జిల్లా నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో (Koppula Eshwar) పాటు బీజేపీ టాప్ లీడర్లు ఈటల రాజేందర్ (Eatala Rajendar), బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పోటీలో ఉన్నారు. కేటీఆర్ టార్గెట్ గా జర్నలిస్ట్ రాణీ రుద్రమను సిరిసిల్ల నుంచి బీజేపీ బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి మరో సారి తలపడుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు బండి సంజయ్. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి దిగిన ఈటలను సొంత సీటులోనే దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇది కూడా చదవండి: Nalgonda Politics: హాట్ టాపిక్ గా నల్గొండ పాలిటిక్స్.. గులాబీల జాతరా? హస్తం హవానా?
కాంగ్రెస్ కూడా ఈ సారి టికెట్ ను ఆ ప్రాంతంలో మంచి పేరు ఉన్న వొడితెల కుటుంబానికి చెందిన ప్రణవ్ ను బరిలో దించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రణవ్ తరఫున బల్మూరి వెంకట్ తదితరులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వేములవాడ నుంచి మాజీ గవర్నర్ కుమారుడు వికాస్ రావు సైతం ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు గాను.. 11 గెలుచుకుంది బీఆర్ఎస్.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణ పేపర్లలో కర్ణాటక యాడ్స్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొత్త వార్!
మరో సారి జిల్లాలో పదికి పైగా స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో అధికార బీఆర్ఎస్ ప్రచారం సాగిస్తుండగా.. మెజారిటీ స్థానాల్లో సత్తా చాటాలన్న వ్యూహంతో కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. మెరుగైన ఫలితాలను సాధించడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు మరో సారి పట్టం కడతారా? కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇస్తారా? బీజేపీని ఆదరిస్తారా? అన్నది డిసెంబర్ 3న తేలనుంది.