Barrelakka: బర్రెలక్కకు గన్మెన్.. ఎన్నికలు ముగిసే వరకు భద్రత.. హైకోర్టు సంచలన ఆదేశాలు

బర్రెలక్కకు గన్మెన్ ను కేటాయించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని.. పోలీసులు కేవలం కార్లు మాత్రమే చెక్ చేస్తాం అంటే కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం.

Barrelakka: బర్రెలక్కకు గన్మెన్.. ఎన్నికలు ముగిసే వరకు భద్రత.. హైకోర్టు సంచలన ఆదేశాలు
New Update

తనకు భద్రత కల్పించాలని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన బర్రెలక్క (శిరీష) హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు (Barrelakka) భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. త్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులందరికీ సెక్యూరిటీ కల్పించాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: TS Elections: వాతావరణ కారణాలతో తిరిగొచ్చిన రేవంత్ హెలికాప్టర్.. రోడ్డు మార్గాల్లో ఆ మీటింగ్స్ కు..

అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తాం.. అంటే కుదరదని తెలిపింది న్యాయస్థానం. బర్రెలక్క కు ఒక గన్మెన్ తో భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆమె నిర్వహించే బహిరంగ సభలకు సైతం భద్రత కల్పించాలని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న బర్రెలక్క కొల్లాపూర్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెండు సారి ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా బరిలో ఉన్న బీరం హర్షవర్దన్ రెడ్డి తో పోటీ పడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఆమె సోదరుడిపై దాడి జరగడం.. ఆ విషయం సోషల్ మీడయాలో వైరల్ గా మారడంతో భారీగా మద్దతు లభించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి టాప్ లీడర్లు సైతం ఆ దాడిని ఖండించారు. ఆమెకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సైతం ఆమెకు అండగా నిలిచారు. కొంత మంది నేరుగా వెళ్లి బర్రెలక్కను కలిసి మద్దతు తెలిపితే.. మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ మద్దతును ప్రకటించారు.

#telangana-elections-2023 #barrelakka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe