TS elections 2023: కట్టల కొద్దీ డబ్బు.. కిలోల లెక్కన బంగారం.. ఇదంతా ఎన్నికల కోసమేనా?

తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికల సమీపిస్తుండడంతో పోలీసుల తనిఖీలు పెరిగాయి. కవాడిగూడ NTPC బిల్డింగ్ దగ్గర రూ.2 కోట్ల 9 లక్షల నగదు సీజ్‌ చేశారు. ఆరుగురును అరెస్టు చేశారు. కారు, బైక్ సీజ్‌ చేశారు. అటు వనస్థలిపురంలో PS పరిధిలో రూ. 29 లక్షల 40 వేలు స్వాధీనం చేసుకున్నారు.

TS elections 2023: కట్టల కొద్దీ డబ్బు.. కిలోల లెక్కన బంగారం.. ఇదంతా ఎన్నికల కోసమేనా?
New Update

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో కట్టల కట్టల డబ్బు.. కిలోల చొప్పున బంగారం బయటపడుతున్నాయి. సోమవారం నాడు నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా బంగారం, నగదును సీజ్‌ చేశారు. గాంధీనగర్‌ పరిధిలోని కవాడిగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ. 2.09 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు వనస్థలిపురంలో రూ.29.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదాపూర్‌లో రూ. 32 లక్షలు, గచ్చిబౌలిలో రూ. 10 లక్షలు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి.

మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

ఇక మియాపూర్‌లో 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా వీటిని తరలిస్తుండడంతో సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండిని ఆదాయపన్ను శాఖ అధికారులు అప్పగించారు.

#telangana-elections-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe