కారులో మంటలు.. కట్ చేస్తే నోట్ల కట్టలు.. ఆ పైసలు ఏ పార్టీవి?

ఎన్నికల కోసం కారు ఇంజిన్ లో డబ్బులు ఉంచి తరలిస్తుండగా మంటలు చెలరేగిన ఘటన వరంగల్ లోని వాగ్దేవీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. మంటలను ఆర్పిన పోలీసులు కారును స్టేషన్ కు తరలించారు. ఆ డబ్బులు ఏ పార్టీవి అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

New Update
కారులో మంటలు.. కట్ చేస్తే నోట్ల కట్టలు.. ఆ పైసలు ఏ పార్టీవి?

ఎన్నికలు (Telangana Elections 2023) దగ్గర పడుతుండడంతో ప్రచారం తగ్గించి పైసల పంపకంపై దృష్టి సారించారు అనేక మంది అభ్యర్థులు. పోలీసులు, ఎన్నికల అధికారుల కళ్లుగప్పి నియోజకవర్గాలకు నోట్ల కట్టలను తరలింపుపై ఫోకస్ పెడుతున్నారు. అయితే.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. అనేక చోట్ల పోలీసుల తనిఖీలకు చిక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కారు ఇంజిన్లో నోట్ల కట్టలు ఉంచి తరలిస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో కారు నుంచి మంటలు వచ్చాయి. బొల్లికుంట సమీపంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారులో మంటలు ఆర్పారు. అనంతరం కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ డబ్బులు ఏ పార్టీవి? ఎవరు, ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే.. ఇంజన్ నుంచి వచ్చే వేడితో నోట్ల కట్టలకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు