మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) నామినేషన్ ను తిరస్కరించాలని రిటర్నింగ్ ఆఫీసర్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. నామినేషన్లో ఆయనపై ఉన్న ఒక కేసుకు సంబంధించిన వివరాలు తెలపలేదని పేర్కొన్నాడు. అతని వారసుడి పేరు మీద ఉన్న కొన్ని ఎకరాల భూమిని కూడా పొందుపర్చలేదని ఫిర్యాదు చేశారు. అయితే.. ఆర్వో ఈ ఫిర్యాదును తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీని నిర్వహించారు అధికారులు. నిబంధనలకు పాటించకుండా దాఖలైన పలువురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.అయితే.. పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ప్రత్యర్థుల నామినేషన్లలో తప్పలు ఉన్నాయని, సరైన వివరాలు లేవంటూ ఆర్వోలకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థులు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్ పై ఫిర్యాదులు అందాయి.
ఇది కూడా చదవండి: Minister KTR: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే!
వనమాపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు ఫిర్యాదు చేయగా.. పువ్వాడ అజయ్ పై కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయితే.. వీరి ఫిర్యాదులను తిరస్కరించిన ఆర్వోలు ఆ ఇద్దరిని అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే.. పువ్వాడ నామినేషన్ విషయంలో కోర్టును ఆశ్రయించనున్నట్లు తుమ్మల ప్రకటించారు.
పెద్దపల్లిలోనూ నామినేషన్ల స్క్రూటినీ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరూ సరైన కారణాలను చూపకపోవడంతో ఇద్దరి నామినేషన్లు సరైనవే అంటూ నిర్ణయం తీసుకున్నారు ఆర్వో. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: BREAKING: జానారెడ్డితో పాటు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్!
భువనగిరి బీఎస్పీ అభ్యర్థి జహంగీర్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ప్రపోజ్ చేసిన వ్యక్తుల పోలింగ్ కేంద్రాలను తప్పుగా నమోదు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.