/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bandi-snaji-kishan-jpg.webp)
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసే ఫస్ట్ లిస్ట్‌పై అందరిచూపు పడింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసింది. ఏ నిమిషంలోనైనా బీజేపీ ఈ లిస్ట్‌ని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఉన్న బీజేపీ అగ్రనేతలు అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి లిస్ట్‌లో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా..14 మంది రెడ్డిలు, 6 వెలమ, 14 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు 20 మంది బీసీలకు చోటు కల్పించినట్టు సమాచారం. మరోవైపు ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు.
బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో అభ్యర్థుల పేర్లు..
1) కోరుట్ల: ధర్నాపూరి అరవింద్
2) ఆదిలాబాద్ : పయాల్ శంకర్..
3)సిరిసిల్ల: రాణి రుద్రమ..
4) కరీం నగర్: బండి సంజయ్
5) బెల్లంపల్లి: శ్రీదేవి
6) జుక్కల్: అరుణా తారా..
7) చొప్పదండి: బోడిగే శ్యోభ
8) బాల్కొండ:అన్నపూర్ణ
9) సూర్యాపేట: సంకినెని వెంక్తేశ్వర రావు..
10) నిర్మల్: ఏలేటి మహేశ్వర రావు.
11) సిర్పూర్: పాల్వాయి హరీష్
12) కల్వకుర్తి: ఆచారి
13) కొల్లాపూర్: సుధాకర్ రావు..
14) వరంగల్ ఈస్ట్: ఎర్రబెల్లి ప్రదీప్ రావు..
15) దుబ్బాక : రఘునందన్ రావు
16) గోషామహల్: రాజాషింగ్
17) నిజామాబాద్ అర్బన్: దన్పాల్ సూర్యనారాయణ..
18) మానుకొండూర్: ఆరేపల్లి మోహన్..
19) హుజురాబాద్: ఈటల రాజేందర్..
20) బోథ్: సోయం బాపురావు
21) చెన్నూరు: వివేక్ వెంకటస్వామి
22) ముదోల్: రామారావు పటేల్
23) నారాయణ ఖెడ్: సంగప్ప
24) ఖానాపూర్: రమేష్ రాథోడ్
25) భూపాల పళ్లి: చందుపట్ల కీర్తి రెడ్డి..
26) వరంగల్ వెస్ట్: రావు పద్మ,
27) భువనగిరి: గూడూరు నారాయణ రెడ్డి..
28) మహేశ్వరం: అందెల శ్రీరాములు..
29) కుత్బుల్లాపూర్: కూనం శ్రీశైలం గౌడ్:
30)పఠాన్ చెరువు: నందీశ్వర్ గౌడ్.
31 ) మహబూబాబాద్ హుస్సేన్ నాయక్
బీజేపీ బీసీ సీఎం ఎవరు?
మరోవైపు తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం అభ్యర్థిగా బీసీ నాయకుడు ఉంటాడని ప్రచారం జరుగుతోంద. రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్ ఉన్నారు. ఇక ఉద్యమంలో ఉన్న నాయకుడిగా ఈటలకు పేరు ఉంది. ఈటల రాజేందర్‌కు మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. అటు బండి, లక్ష్మణ్‌కు RSS బ్యాక్‌గ్రౌండ్ ఉండడం ప్లస్‌గా మారింది. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: మీ పని ఖతం.. కేటీఆర్, రేవంత్ మధ్య ట్వీట్ వార్.. అసలేంటి గొడవ??
Follow Us