/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Kodangal-Election-Polling-jpg.webp)
Clashes Between BRS and Congress: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఈ నియోజకవర్గం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అత్యంత కీలకం. అందుకే.. ప్రతి పోలింగ్ బూత్ వద్ద చాలా జాగ్రత్తంగా ఉంటున్నారు ఇరు పార్టీల శ్రేణులు. అయితే, తాజాగా కొడంగల్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొడంగల్ నియోజకవర్గం రేగడి మైలారం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్‌కు బీఆర్ఎస్ అభ్యర్థి రావడంపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పట్నం నరేందర్ రెడ్డి.. వెళ్లిపోయాక ఇరు పార్టీల వర్గాలు ఘర్షణకు దిగాయి. అయితే, రోడ్డుపై ఘర్షణ పడటంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు..
నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో వచ్చిన మంత్రి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పార్డీ కండువాతో వచ్చి ఓటు వేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిర్మల్ రూరల్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.
పటాన్ చెరులో విగ్వాదం..
పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడంపై బీఆర్ఎస్, బీఎస్పీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముగ్గురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఇస్నాపూర్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు శ్రీనివాస్ గౌడ్ సతీమణి సుధ. దాంతో బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు వాగ్వాదానికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం చుట్టూ ఉన్నవారిని కూడా అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు.
మణికొండలో లాఠీ ఛార్జ్..
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఇరువర్గాల వారు టేబుల్ కుర్చీలు పడేసి దుర్భాషలాడుతూ ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. లాఠీ ఛార్జ్ చేసి గొడవను అదుపు చేశారు. ఇక ఒకరిపై మరికొరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
Also Read: