Telangana Assembly Adjourned: వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం.. సభను వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున సభలో హరీష్ రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. స్పీకర్ అంగీకరించలేదు. తొలుత అవకాశం ఇచ్చినా.. హరీష్ రావు క్లారిఫికేషన్ కాకుండా వేరే అంశాలు ప్రస్తావించడంతో ఆయన మైక్ కట్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే సభను బుధవారానికి వాయిదా వేస్తూ ప్రకటించారు స్పీకర్. కాగా, నేటి సభలో హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, డ్రగ్స్ అంశంపై కీలక చర్చ జరిపారు.
Also Read:
వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి..