తెలంగాణ, ఏపీలో దసరా సెలవులకు (Dasara Holidays) ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ విషయానికి వస్తే.. అక్టోబర్ 13వ తేదీ నుంచి దసరా సెలవులు (Telangana Dasara Holidays) ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు 25వ తేదీ వరకు మొత్తం 13 రోజులు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంకా.. స్కూల్ విద్యార్థులకు ఎస్ఏ-1 ఎగ్జామ్స్ 5వ తేదీ నుంచి 11 వరకు ఉంటాయని వెల్లడించింది. 8వ తరగతి విద్యార్థులకు సాయంత్రం, మిగతా విద్యార్థులకు ఉదయం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎస్ఏ పరీక్షలు ముగిసిన తర్వాత 13 నుంచి 25 వరకు సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. అనంతరం 26 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక సూసైడ్
ఇదిలా ఉంటే.. ఏపీలోనూ దసరా సెలవులు (AP Dasara Holidays) ఖరారయ్యాయి. అక్టోబరు 13 నుంచి ఏపీలో దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 5 నుంచి 11వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబరు 25 వరకు సెలవులు కొనసాగనుండగా.. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: AP Tenth Exams 2023: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం!
వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసేది దసరా సెలవుల కోసమే. ఈ సారి 13 రోజులు దసరా సెలవులు రావడంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. అయితే.. రానున్న అక్టోబర్ నెలలో దసరా సెలవులతో పాటు మరో 4 సెలవులు రానున్నాయి. దసరా సెలవులు కాకుండా మరో 3 ఆదివారాలు రానున్నాయి. ఇంకా 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మరో సెలవు ఉంటుంది. దీంతో విద్యార్థులకు మొత్తం 17 సెలవులు అక్టోబర్ నెలలో రానున్నాయి.