/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/96a1ba13-9b0a-4920-b3cf-1986718aa44b.jpg)
టెక్నో పోవా 6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉండటం విశేషం. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై టెక్నో పోవా 6 ప్రో 5జీ పని చేయనుంది. 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు ర్యామ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.21,999 ఉంది. ప్రారంభ ఆఫర్ కింద టెక్నో పోవా 6 ప్రో 5జీని ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు అందించనున్నారు. అంతే కాకుండా రూ.4,999 విలువైన టెక్నో ఎస్2 స్పీకర్‌ను ఉచితంగా అందించనున్నారు. కామెట్ గ్రీన్, మీటియోరైట్ గ్రే రంగుల్లో టెక్నో పోవా 6 ప్రో 5జీ లాంచ్ అయింది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది. టెక్నో పోవా 6 ప్రో 5జీలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌పై టెక్నో పోవా 6 ప్రో 5జీ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉండగా, దీన్ని వర్చువల్‌గా మరో 12 జీబీ పెంచుకునే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్లో 8 జీబీ వరకు మాత్రమే పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... టెక్నో పోవా 6 ప్రో 5జీ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మరో ఏఐ ఆధారిత లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం టెక్నో పోవా 6 ప్రో 5జీలో ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.