UP AI Hub: ఉత్తరప్రదేశ్‌లో AM గ్రూప్ 1 గిగావాట్ గ్రీన్-పవర్ AI హబ్..

ఏఎం గ్రూప్ UP గ్రేటర్ నోయిడా‌లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన గ్రీన్ పవర్ AI హబ్ ఏర్పాటు చేస్తోంది. 24/7 పర్యావరణహిత శక్తితో పనిచేసే ఈ ప్రాజెక్టుకు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఉంటుంది. 2028కి మొదటి దశ, 2030కి పూర్తి సామర్థ్యం లక్ష్యంగా పని జరగనుంది.

New Update
UP AI Hub

UP AI Hub

UP AI Hub: గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకుల నేతృత్వంలో పనిచేస్తున్న ఏఎం గ్రూప్(AM Group) ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన కార్బన్ రహిత, అధిక సామర్థ్య AI కంప్యూటింగ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది అంతర్జాతీయంగా AI అవసరాలను తీర్చగల విధంగా రూపొందుతోంది.

దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విభాగం ‘ఇన్వెస్ట్ యూపీ’తో ఏఎం గ్రూప్ ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2.25 లక్షల కోట్ల (25 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉండనుంది.

ప్రాజెక్టు దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ 2028 నాటికి పూర్తి అయ్యిన తర్వాత, 2030 నాటికి పూర్తి 1 GW సామర్థ్యాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అధిక సామర్థ్యం గల చిప్‌సెట్‌లు ఉపయోగించనున్నారు. ఇది దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత పెద్ద AI పెట్టుబడిలో ఒకటి.

ఏఎం గ్రూప్ ఛైర్మన్ అనిల్ చలమలశెట్టి మాట్లాడుతూ, “గ్లోబల్ AI వ్యవస్థ పరిణామం భవిష్యత్తు తరాలకు చాలా కీలకం. ఎలక్ట్రాన్ ఏజెంట్లను ఇంటెలిజెంట్ టోకెన్లుగా మార్చడంపై మేము దృష్టి సారిస్తున్నాం” అని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ, 1 గిగావాట్ AI సామర్థ్యాన్ని 24/7 గ్రీన్ ఇంధనంతో అనుసంధానిస్తారు. దీని ద్వారా AI మౌలిక వసతులలో సుస్థిర నమూనా ఏర్పడుతుంది.

ఈ AI హబ్ విద్యుత్ ఉత్పత్తి నుంచి AI కంప్యూటింగ్ వరకు పూర్తి పరిష్కారాన్ని అందించేందుకు AMG AI Labs అభివృద్ధి చేస్తోంది. సౌర, వాయు, పంప్ స్టోరేజ్ వంటి శక్తులను ఉపయోగించి పర్యావరణహిత (కార్బన్-ఫ్రీ) గ్రీన్ పవర్ అందిస్తారు.

సౌకర్యాలు శక్తివంతమైన, తక్కువ లేటెన్సీ కనెక్టివిటీతో ఉండడంతో, గ్లోబల్ AI అవసరాలను తీర్చగలుగుతుంది. ఇది హైపర్స్‌కేలర్లు, పరిశోధన కేంద్రాలు, ఇండస్ట్రీస్కు ఉపయోగపడుతుంది. అలాగే, భారతీయ డెవలపర్లుకు అధిక సామర్థ్య చిప్‌లను సులభంగా అందించగలుగుతుంది.

ఈ ప్రాజెక్టు విదేశీ పెట్టుబడులు, నైపుణ్యమున్న ఉద్యోగాలును సృష్టించి, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీలకు స్థానిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుంది.

 ఏఎం గ్రూప్ నాయకత్వం సుస్థిర, కార్బన్-న్యూట్రల్, అధిక సామర్థ్య AI ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో భరత్ ను ముందుకు నడిపేందుకు కృషి చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు