/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-Interview.jpg)
Chandrababu About Amaravati Development: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎల్లుండి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు, రాజకీయవర్గాల ఫోకస్ అమరావతిపై పడింది. కూటమి విజయంతో అమరావతిలో మళ్లీ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు ఆర్టీవీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఆర్టీవీతో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని అభివృద్ధి చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆర్ధికంగా సహకరిస్తుందన్న నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. అమరావతికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
Follow Us