MP Kalishetty: అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్.!

గల్లీలో మొదలైన తన ప్రస్తావన ఢిల్లీ దాకా వెళ్లడం సంతోషంగా ఉందన్నారు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఉత్తరాంధ్రలో చాలా సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతానన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన ఉంటుంది కానీ దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు.

New Update
MP Kalishetty: అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్.!

MP Kalishetty Appalanaidu: ఉత్తరాంద్ర ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. చంద్రబాబు విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటించడం ఆనందమన్నారు. టికెట్లు, పదవుల విషయంలో చంద్రబాబు ఉత్తరాంద్రకు పెద్ద పీఠ వేశారని కొనియాడారు.

Also Read: వైసీపీ శ్రేణులకు ఇదే నా విజ్ఞప్తి.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎమోషనల్ కామెంట్స్

చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని.. ఉత్తరాంద్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అయితే, కొంత మంది ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రమాణస్వీకర కార్యక్రమనికి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చిన హాజరుకాలేదని తెలిపారు. RTVతో ఆయన మాట్లాడుతూ.. గల్లీలో మొదలైన తన ప్రస్తావన ఢిల్లీ దాకా వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో చాలా సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతానన్నారు.

Also read: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు

కూటమి ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అని..ప్రచార ప్రభుత్వం కాదని అన్నారు. ఋషికొండా భవనాలను ప్రజల అవసరాలు కోసం ఉపయోగిస్తారన్నారు. కూటమి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులను కాపాడే ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఉత్తరాంద్ర లో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరాంద్రలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిపెట్టమని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు