TDP MLA candidate Attack Update: తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత భాను అనుచరులు పులివర్తి నానిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. ఆయన గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
పూర్తిగా చదవండి..TDP: ఎమ్మెల్యే అభ్యర్థి దాడి కేసులో 13 మంది అరెస్ట్.. అన్యాయంగా తమ వారిని ఇరికించారంటున్న బాధిత మహిళలు..!
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దాడి కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేశారు. తిరుపతి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసుతో సంబంధం లేని వారిని ఇందులో ఇరికించారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు.
Translate this News: