/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/mahila.jpg)
TDP MLA candidate Attack Update: తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత భాను అనుచరులు పులివర్తి నానిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. ఆయన గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read: విమానంలో ‘బాంబ్’ నోట్ కలకలం.. వాష్‌రూంలో టిష్యూ పేపర్ పై..
అయితే, తిరుమలలో 12వ తేది జరిగిన స్థానిక గలాటాపై తిరుమల టూ టౌన్ లో విచారణ చేసిన పోలీసులు.. ఈ కేసులో విచారణ పేరుతో తీసుకొచ్చి సంబంధం లేని కేసులో ఇరికించారని పలువురు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రధాన ముద్దాయి భాను ప్రకాష్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. బెయిల్ ఇప్పిస్తానని తీసుకొచ్చి అరెస్టు చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి.