AP: ఆయన దేశముదురు.. చేసిన అవినీతి మొత్తం కక్కిస్తా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎక్స్ క్లూజివ్
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ అవినీతి మొత్తం బయటికి తీస్తానన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిన్న ప్రతి అవినీతి రూపాయిని కక్కిస్తానన్నారు. జగన్ మాటలకి, చేతలకి సంబంధం లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MLA Bojjala Sudheer Reddy: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ అవినీతి మొత్తం కక్కిస్తానన్నారు. తిన్న ప్రతి అవినీతి రూపాయిని కక్కిస్తానన్నారు. మధుసూదన్ రెడ్డిని అందరూ అమాయకులు అనుకుంటారు కానీ ఆయన దేశముదురు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యేపై విచారణ జరిపిస్తామన్నారు.
అప్పుడు అధికారులు భయపడి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జగన్ కి గుడి కట్టారని.. ఇప్పుడు ఆ గుడిని తొలగించామని తెలిపారు. జగన్ మాటలకి, చేతలకి సంబంధం లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చింది జగనేనని ఆరోపించారు. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టలేదని విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన అప్పుల గురించి మొత్తం వివరాలు బయట పెడతామన్నారు.