MLA Bhumireddy Ramgopal Reddy: సివిల్ సప్లాయిస్ లో భారీగా గొల్ మాల్ జరుగుతోందన్నారు కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి. మిల్లర్ల నుంచి సివిల్ సప్లాయిస్ గొడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతుందన్నారు. ఒక్కొ బస్తాకు 5 కిలోల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ దోపిడికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్దాయిలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనల్లో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు.
Also Read: ఆ వ్యవస్థను రూపు మాపుతా.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
మిల్లర్ల నుంచి తక్కువ తూకంతో బస్తాలు వస్తే సివిల్ సప్లాయిస్ గోడౌన్ అధికారులు తీసుకొవద్దని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పులివెందులలో గత ప్రభుత్వం భారీ స్కీల్ డెవలప్ మెంట్ భవనాలు నిర్మించారని..కానీ వాటిని వినియోగించుకొలేకపొయారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో తప్పక వాటిని వాడుకుని యువతి యువకులకు నైపుణ్యా శిక్షణ అందిస్తామని అన్నారు.