నంద్యాలలో ఈ రోజు నిర్వహించిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (TDP PAC) మీటింగ్ ముగిసింది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మీడియాతో మాట్లాడారు. మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) నిరసిస్తూ అక్టోబర్ 2వ తేదీన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని ప్రకటించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి పోరాడుతాన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. మేలుకో తెలుగోడా అనే నినాదంతో ముందుకు వెళ్తామని ఆయన ప్రకటించారు. జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయన్నారు. పవన్ కల్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. యాత్రలో తెలుగు దేశం కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా పాల్గొంటారని ప్రకటించారు బాలకృష్ణ.
ఇది కూడా చదవండి: Big Breaking: యనమలకు టీడీపీ పగ్గాలు.. చంద్రబాబు కీలక నిర్ణయం?
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పొలిటికల్ యాక్షన్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసుకు ఆవేదన తో రాష్ట్రంలో 95 మంది మృతి చెందాన్నారు. వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత పరామర్శిస్తారన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్న సందర్భంగా.. ఆ రోజు సాయంత్రం ప్రతీ ఇంట్లో లైట్లు అపేసి కొవ్వొత్తులతో అందరూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీ సభ్యులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుందన్నారు.
రెండు పార్టీలు గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయిలో కలిసి పనిచేస్తాయన్నారు. వారాహి యాత్ర చేస్తున్న జనసేనకు టీడీపీ నుంచి పూర్తి మద్దతు ఉందటుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఇప్పుడు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడవ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మొదటి సారి ఐటీ ఉద్యోగులు బయటికి వచ్చి నిరసనలు తెలియచేయడం ఓ చరిత్ర అని అన్నారు. 70 దేశాల్లో బాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఆందోళన జరుగుతుందన్నారు.