MLA Gummanur Jayaram: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ..! ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాకొద్దు.. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ముద్దు అంటున్నారు అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాంకు గుంతకల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. By Jyoshna Sappogula 08 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Alur MLA Gummanur Jayaram: ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తనకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ అధికార పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గం టికెట్ ను తనకు కేటాయించారని పేర్కొన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. Also Read: హనుమకొండ జిల్లాలో దారుణం.. విద్యార్థిని సూసైడ్ అయితే, గుంతకల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మా కొద్దు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ముద్దు అని నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు నిరసన చేపట్టారు. ఆర్ అండ్ బి కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీ చేయడం ఏంటని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. Also Read: రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..! గుమ్మనూరు జయరాం తన నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొంది తన సత్తా ఏంటో ప్రత్యర్థి అభ్యర్థికు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. లేదంటే డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని హెచ్చరించారు. గుమ్మనూరు జయరాం మాకొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ హోరెత్తించారు. గుంతకల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జితేంద్ర గౌడ్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 11న గుత్తిలో జరిగే నారా లోకేష్ శంఖారావం కార్యక్రమంలో ఎవరు పాల్గొనరని తేల్చిచెప్పారు. #alur-mla-gummanur-jayaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి