TDP And YCP Furniture War: ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఫర్నీచర్ పంచాయితీ ఇంకా ఆగలేదు. సోషల్ మీడియా వేధిక ద్వారా ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వ ఫర్నీచర్ జగన్ నివాసంలో ఉందంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు నిన్న వైసీపీ సమాధానం ఇచ్చిన విషయ తెలిసిందే. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను జగన్ క్యాంపు కార్యాలయంలో (Jagan Camp office) ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. దీనికి టీడీపీ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చింది. ''మరీ కక్కుర్తి కాకపోతే, నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ కూడా ప్రభుత్వ డబ్బుతో తీసుకోవాలా ? ఛీ ఛీ..'' అంటూ జగన్ టార్గెట్ గా ట్వీట్ చేసింది టీడీపీ.
''తప్పుడు ప్రచారాలు పుట్టేదే ఆ కోళ్ల ఫారం కొంపలో.. వ్యక్తిత్వం లేని నీతిమాలిన వ్యక్తి ఎవరో, సొంత తల్లి, సొంత చెల్లి చెప్పారులే''.. అంటూ టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ట్వీట్ కు వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనే అంశం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
Also Read: జగన్ మనుషులనే కాదు మిషన్లను కూడా నమ్మడు.. ఏపీ సచివాలయంలో కొత్త చర్చ!