AP: రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన మాజీ మంత్రి..!

జగన్ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ నేత పల్లె రఘునాథ్ రెడ్డి. వాటికి సాక్ష్యాలుగా అన్ని జిల్లాలో నిర్మించిన వైసీపీ కార్యాలయాలే కాకుండా అనేక రకాల అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మంచి పాలన ఇచ్చే విషయంలో ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

New Update
AP: రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన మాజీ మంత్రి..!

TDP Leader Palle Raghunatha Reddy: జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. వాటికి సాక్ష్యాలుగా అన్ని జిల్లాలలో ప్రభుత్వ స్థలాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వైసీపీ కార్యాలయాలు, ఇంకా అనేక రకాల అంశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Also Read: అధికార బలంతో ఇలా చేశారు: ఎమ్మెల్యే చంటి

జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గడిచిన ఐదు సంవత్సరాల కాలం కోర్టులకు కూడా హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటన్నిటికి కచ్చితంగా సమాధానం చెప్పడమే కాకుండా వాటిని ఎదుర్కోవాలని అన్నారు. అంతేకాకుండా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతి దోపిడి అంతటిని వెలికి తీస్తామన్నారు. ప్రజలకు మంచి పాలన ఇచ్చే అంశంలో ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఉద్ఘాటించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు