/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tdp-16-jpg.webp)
TDP leader Dhulipalla Narendra: సోషల్ మీడియాలో తనపై వచ్చిన అసత్య ప్రచారాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు టిడిపి నేత ధూళిపాళ్ళ నరేంద్ర. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19 న విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారని..అయితే అదే రోజు సాయంత్రం తన పేరిట వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రారంభించిందని ఆరోపించారు.
Also Read: శ్వేత సూసైడ్.. భర్తను అలా చూసి తట్టుకోలేకపోయిన కావ్య నెక్ట్స్ ఏం చేయనుంది?
వైసిపి కీలక నేతల కుట్రతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కామెంట్స్ చేశారు. మంత్రి అప్పలరాజు పి ఆర్ ఓ తదితరులు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేశారని అన్నారు. కోనసీమ అల్లర్లు మాదిరిగా గుంటూరు - కృష్ణా జిల్లాలో అల్లర్ల కోసం కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసత్య ప్రచారాలపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వ్యాఖ్యనించారు.
Also Read: ఈ నెల 24న ఏపీ బంద్.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు
తనపై జరుగుతున్న కుట్రపై ఎస్పీ ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం వెనుకున్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానంకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనకున్న అసలు పాత్రధారులు, సూత్రదారులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.