/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-leader-jpg.webp)
Former MLC Tippeswamy: అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎమ్మెల్సీ వర్గానికే టికెట్ కేటాయించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయిన కార్యకర్త చంద్రశేఖర్ ను వెంటనే పక్కనున్న పార్టీ నేతలు అడ్డుకున్నారు.
Also Read: ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన ఎంపీ.. సిద్ధం సభలో సవాల్!
మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మధ్య గత కొంతకాలంగా వర్గ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరన్న కుమాడు సునీల్ కుమార్‌కు రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం లభించింది. దీంతో విభేదాలు పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మద్దతు కోసం ఈరన్న ప్రయత్నాలు చేశారు. అయితే, సునీల్ కుమార్‌కు సీటు ఇవ్వడాన్ని తిప్పేస్వామి వర్గం ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పలువురు రాజీనామాలు కూడా చేశారు.
Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!
తాజాగా, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నివాసం నుండి 5 వేల మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్త చంద్రశేఖర్ ఆత్మహత్యయత్నం చేశాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ ను తప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అన్యాయం అయిపోతారని వాపోయాడు. టికెట్ వేరే ఎవరికి ఇచ్చినా పనిచేస్తామని సునీల్ కుమార్ కు ఇస్తే పనిచేసేదే లేదని తేల్చిచెబుతున్నారు.
Follow Us