Buddha Venkanna: చంద్రబాబుకు బుద్దా రక్తాభిషేకం.. ఏకంగా కోసేసుకున్నాడుగా! టీడీపీ నేత బుద్దా వెంకన్న చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. స్వయంగా తన రక్తంతో ఇలా చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న బుద్దా.. చంద్రబాబుకు పరోక్ష హెచ్చరికలు పంపేందుకే ఇలా చేశారని సమాచారం. బుద్దా మాత్రం ఇదంతా స్వామిభక్తి అంటున్నారు. By Trinath 18 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న ఏం చేసినా తనదైన మార్క్ కనిపిస్తుంటుంది. ప్రత్యర్థులను తిట్టాలన్నా.. తనని తాను తిట్టుకోవాలన్నా.. చంద్రబాబుపై తనకున్నా గౌరవాన్ని అందరి ముందు ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలనుకున్నా డిఫరెంట్‌గా చేస్తుంటారు బుద్దా. మరోసారి కూడా అదే నిజమని ప్రూవ్ చేసుకున్నారు. రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి కాళ్లు కడిగారు బుద్దా వెంకన్న. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బుద్దా వెంకన్న నానా పాట్లు పడుతున్నాడు. రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి కాళ్లు కడగడం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. తన ఇంటి గోడపై CBN జిందాబాద్ అని రాసుకొచ్చాడు బుద్దా. నా ప్రాణం మీరే అంటూ గోడ మీద రాశారు. ఇక అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని బుద్దా వెంకన్న ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇక్కడ స్విచ్ వేస్తే వేరేచోట్ల లైట్లు ఆన్ అవుతాయని.. పరోక్షంగా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్‌పైనా లేదా అనకాపల్లి ఎంపీ సీటుపైనా బుద్దా వెంకన్న ఆశలు పెట్టుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటికే భారీ ర్యాలీలు కూడా నిర్వహించారు. ఈ నెల ప్రారంభంలో ఇంద్రకీలాద్రి ఆలయంలో కామధేనువుకు ప్రత్యేక పూజలు చేశారు. టిక్కెట్టు ఆశించి ఇటీవల చేరిన వారి కంటే మొదటి నుంచి విధేయులుగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. సీట్ల కేటాయింపుపై నిర్ణయం చంద్రబాబుదేనని, ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తన అంకితభావాన్ని, త్యాగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వెంకన్న కోరుతున్నారు. బ్లాక్‌మెయిలింగ్ వ్యూహాలకు పాల్పడే వారికి తగిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. Also Read: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన #chandrababu-naidu #buddha-venkanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి