/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tdp-5-jpg.webp)
TDP-JSP: తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి-జనసేన ఇంచార్జ్ లు బొడ్డు వెంకటరమణ చౌదరి, బత్తుల బలరామకృష్ణ, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అధినేతలు రాజానగరంలో సీట్ ఎవరికి కేటాయించిన కట్టుబడి పనిచేస్తామని వ్యాఖ్యనించారు. వైసీపీ ను ఓడించేందుకు టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తామంటూ వెల్లడించారు.
Also Read: కేసీఆర్, కేటీఆర్ కాళ్ల బేరానికి వచ్చారు..కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.!
ఉమ్మడిగా కార్యాచరణ రూపొందిస్తామంటూ రాజనగరం నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీని గద్దె దింపె వరకు కలిసి కట్టుగా పొరాడుతామన్నారు. కొందరు వైసీపీ వారు జనసేన టిడిపి ముసుగులో రెచ్చగొడుతున్నారని ఎప్పటికప్పుడు ఇరు పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి ద్వారకమాయి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ ఆత్మీయ సమావేశం లో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
Also Read: ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమ వ్యక్తం చేశారు. రాబోవు కాలంలో పార్టీ అధినేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గంలో టిక్కెట్ ఎవరికిచ్చినా ప్రజా శ్రేయస్సు కొరకు కలిసి పోరాడుతూ ముందుకు సాగుతామని వెల్లడించారు.
Follow Us