TDP-JSP: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై మండిపడ్డారు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపు లేటి హరి ప్రసాద్, టిడిపి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్ల బాబు.
డా. పసుపు లేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించే సత్తా చల్లా బాబుకు ఉందన్నారు. తమపై తప్పుడు కేసులు బనాయించి పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టించినా భయపడేదిలేదని అన్నారు. ఈ క్రమంలోనే పుంగనూరు దొంగ ఓట్లపై మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్లును చేస్తోందని అరోపించారు. తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుంగనూరు నుండి అత్యధికంగా దొంగ ఓటర్లని తరలించారాని దుయ్యబట్టారు.
Also Read: మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. ప్రేమ జంట సంచలన వ్యాఖ్యలు.!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబుల కలయిక ఓ సరికొత్త అధ్యాయము సృష్టిస్తుందని కొనియాడారు. చంద్రబాబు 14సంవత్సరాల అనుభవం, ప్రజలకు న్యాయం చేకూర్చాలన్న పవన్ నైజం రెండు కలిసి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రం తెస్తాయని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను రూపు మాపడానికి జగన్ ను ఓడించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి వైసీపీని గద్దె దింపుతామన్నారు.
టిడిపి నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం బలపడుతున్నదన్న భయంతోనే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అయితే, ఎన్ని వేల కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని ధీమ వ్యక్తం చేశారు. పుంగనూరు ప్రజలు వైసిపి అరాచకాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం వస్తోందని వ్యాఖ్యనించారు. టిడిపి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు.