TDP Devineni Uma: ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు టీడీపీలో రెండు వర్గాలుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు చేతులు కలిపారు. టీడీపీ గెలుపు కోసం కలిసి పని చేస్తామంటూ ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు.
Also Read: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం ఖాయమని కామెంట్స్ చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రేపు సాయంత్రం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
Also Read: మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ
ఇదిలా ఉండగా.. రిసెంట్ గా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మైలవరం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అధిష్టానానికి వీరి ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది ఓ సవాలుగా మారింది. గతంలో టికెట్ కోసం దేవినేని ఉమా, బొమ్మసాని మధ్య పోటీ జరిగింది. ఇప్పుడు ఎమ్మెత్యే వసంత ఎంట్రీతో ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. వసంత రాకను ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు కూడా గుప్పించారు. మరి టీడీపీ వసంతకు మైలవరం సీటు ఇస్తుందా లేదంటే పెనుమలూరు ఇస్తుందా?. ఒకవేళ వసంతకు టికెట్ ఇస్తే మరి ఉమా, బొమ్మసాని వర్గం రచ్చకెక్కి పార్టీకి నష్టం కలిగిస్తారా అని టీడీపీలో ఆందోళన మొదలైంది.