Chandrababu: చంద్రబాబుకు ఈ ఏడాది అధికార యోగం.. !

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబుకు వేద పండితులు ఉగాది పచ్చడి అందించారు. చంద్రబాబుకు ఈ ఏడాది అధికార యోగం ఉందని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ పేర్కొన్నారు. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతోందన్నారు.

New Update
Chandrababu:  చంద్రబాబుకు ఈ ఏడాది అధికార యోగం.. !

TDP Chief Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత చంద్రబాబుకు వేద పండితులు ఉగాది పచ్చడి అందించారు. పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందన్నారు.

Also Read: జనసేనకు బిగ్ షాక్.. పార్టీ సమన్వయకర్త రాజీనామా..!

చంద్రబాబుకు అధికార యోగం ఉందని పేర్కొన్నారు. త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతోందన్నారు. బ్రహ్మ - మోడీ, విష్ణువు - పవన్, ఈశ్వరుడు - చంద్రబాబు అని కామెంట్స్ చేశారు. 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ స్థానాలు కూటమికి వస్తాయని అన్నారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు