TDP: వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. ఘన విజయం సాధించి.. నేనేంటో చూపిస్తా: సింధూర

పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర. పూలకుంట్లపల్లిలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అభివృద్ధి చేసి చూపుతానన్నారు.

New Update
TDP: వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. ఘన విజయం సాధించి.. నేనేంటో చూపిస్తా:  సింధూర

Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అభివృద్ధి చేసి చూపుతానన్నారు. అమడుగూరు మండలం పూలకుంట్లపల్లిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.

Also Read: రసవత్తరంగా పులివెందుల రాజకీయం.. సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్‌ తల్లి లక్ష్మి లేఖ

ఈ సందర్భంగా పల్లె సింధూర మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత వలసలు పోతున్నట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే కియా లాంటి పరిశ్రమను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Also Read: పిఠాపురానికి మెగా ఫ్యామిలీ.. పవన్‌ కు మద్దతుగా చిరంజీవి, రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ ప్రచారం..!

193 చెరువులు నీటితో నింపుతానని చెప్పి ఒక్క చెరువుకు కూడా నీరు ఇవ్వకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మే 13న టీడీపీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని.. ఎమ్మెల్యేగా తాను గెలుపొందిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి నియోజకవర్గంలో తన మార్క్ అభివృద్ధిని చేసి చూపుతానని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు