Union Budget 2024: బడ్జెట్ నుంచి టాక్స్ పేయర్స్ కోరుతున్నది ఇదే.. నిర్మలమ్మ కరుణిస్తారా?

కేంద్ర బడ్జెట్ త్వరలో రానుంది. ఈసారి బడ్జెట్ లో పన్ను మినహాయింపు రాయితీ పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరగడంతో పెరిగిన ఖర్చులు, ఆదాయంలో అంతంత మాత్రం మార్పులతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకం పన్ను రాయితీ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. 

Union Budget 2024: బడ్జెట్ నుంచి టాక్స్ పేయర్స్ కోరుతున్నది ఇదే.. నిర్మలమ్మ కరుణిస్తారా?
New Update

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ఈ నెల 23వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్ లో సామాన్యులకు ఎటువంటి సహాయం అందుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈసారి నిర్మలా సీతారామన్ ఎటువంటి తాయిలాలు ఇస్తారో.. లేకపోతే వాతలు పెడతారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, కేంద్ర బడ్జెట్ వస్తుంది అనగానే ఎక్కువగా ఆసక్తి కనబరిచే వర్గం మధ్యతరగతి ప్రజలు. అందులోనూ ఉద్యోగస్తులు ఉంటారు. టాక్స్ పేయర్స్ గా భారత ఆర్ధిక శక్తికి చోదకులుగా ఈ వర్గం ఎక్కువగా ఉంటారు. వీరు ప్రతి బడ్జెట్ సమయంలోనూ పన్నుల విషయంలో ఆర్ధిక మంత్రి ఏదైనా వరం ఇవ్వకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తారు. ఈసారి బడ్జెట్ ముందు కూడా పన్ను చెల్లింపుదారులకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఏమిటి? వాటి వలన వారికీ కలిగే లాభం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. 

పన్ను మినహాయింపు పరిమితి..
Union Budget 2024: జూలై చివరి వారంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై సామాన్యులకు అనేక అంచనాలు, కోరికలు ఉన్నాయి. బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచాలని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఈ పన్ను మినహాయింపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది.

Union Budget 2024: ప్రతి బడ్జెట్‌లోనూ వివిధ రంగాల వారు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చాలా రాయితీలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న వారు సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ సెక్షన్ కింద లక్షన్నర రూపాయల వరకు మినహాయింపు ఉంది. అంటే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని ఆ మొత్తంలో తగ్గించుకోవచ్చు. రూ.1.5 లక్షల మినహాయింపు పరిమితిని కనీసం రూ.2 లక్షలకు పెంచాలన్నది సామాన్యుల డిమాండ్.

2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద మినహాయింపు మొత్తాన్ని రూ.1.5 లక్షలకు పెంచారు. ఇది సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఆ తర్వాత మినహాయింపు పరిమితిలో ఎలాంటి మార్పు రాలేదు. అంటే దాదాపుగా పదేళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. 

ప్రజల అసంతృప్తి..
Union Budget 2024: గత పదేళ్లలో ప్రజల ఆదాయంలో చాలా మార్పులు వచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. పన్ను భారం కూడా పెరుగుతోంది. అయితే, పన్ను మినహాయింపు పరిమితి ఒకే విధంగా ఉండటంపై పన్ను చెల్లింపుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పన్ను మినహాయింపు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది?
Union Budget 2024: పన్ను మినహాయింపు చాలా ముఖ్యమైనది కావడానికి ఒక కారణం ఉంది. మీ ఆదాయం మొత్తానికి పన్ను విధించారు. మీ జీతంలో PF, NPS, HRA మొదలైనవి కాకుండా, మిగిలిన మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. దీనిని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం అంటారు. సెక్షన్ 80సి కింద లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందినట్లయితే, పన్ను విధించదగిన ఆదాయం ఆ మొత్తంలో తగ్గుతుంది.

ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు అంతా నిర్మలా సీతారామన్ బడ్జెట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ కోరికను తీరుస్తారని గట్టి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. 

#union-budget-2024 #budget-aspirations
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe