Tata Motors Demerger: రెండు సంస్థలుగా టాటా మోటార్స్.. షేర్ హోల్డర్స్.. కస్టమర్ల పరిస్థితి ఏమిటి? 

టాటా మోటార్స్ ను రెండు సంస్థలుగా విభజన చేసేందుకు టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ డీ మెర్జర్ వలన వాటాదారులకు.. కస్టమర్లకు.. లెండర్స్ కు ఎటువంటి నష్టం ఉండదని టాటా మోటార్స్ తెలిపింది. డీ మెర్జర్ ప్రక్తియ పూర్తి కావడానికి 12-15 నెలల సమయం పడుతుంది. 

New Update
TATA Motars: భారీ లాభాలతో టాటామోటార్స్ సంచలనం.. ఒక్క ఏడాది లాభాలు వింటే మతిపోతుంది 

Tata Motors Demerger: టాటా మోటార్స్ రెండు సంస్థలుగా విడిపోయింది. ఈ మేరకు టాటా మోటార్స్ లిమిటెడ్ బోర్డు సోమవారం (మార్చి 4) కంపెనీ వ్యాపార కార్యకలాపాలను రెండు వేర్వేరు సంస్థలుగా విభజిస్తూ ఆమోదం తెలిపింది. కంపెనీ తన వాణిజ్య వాహనాలు అలాగే,  ప్రయాణీకుల వాహనాల వ్యాపారాన్ని వేరు చేస్తోంది. ఇక నుంచి వాణిజ్య వాహనాల వ్యాపారం, దానికి సంబంధించిన పెట్టుబడులు ఒకే కంపెనీగా ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు (EV-ఎలక్ట్రిక్ వాహనాలు), JLR (జాగ్వార్ ల్యాండ్ రోవర్) దాని సంబంధిత పెట్టుబడులతో సహా ప్రయాణీకుల వాహన వ్యాపారం మరొక కంపెనీగా వేరు(Tata Motors Demerger) అవుతుంది. టాటా మోటార్స్ సోమవారం ఎక్స్ఛేంజీలకు ఈ సమాచారం అందించింది. విభజన ప్రక్రియ SCLT స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ కింద జరుగుతుంది.  అయితే టాటా మోటార్స్ అన్ని వాటాదారులకు రెండు నమోదిత కంపెనీల షేర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.

12 - 15 నెలల సమయం..
విభజనకు సంబంధించిన అన్ని అనుమతులు పూర్తి కావడానికి 12 నుండి 15 నెలల సమయం పడుతుంది.విభజన (Tata Motors Demerger)కోసం ఎన్‌సిఎల్‌టి స్కీమ్‌కు టాటా మోటార్స్ బోర్డు, వాటాదారులు, లెండర్స్  అలాగే  రెగ్యులేటర్ల నుండి అనుమతి అవసరం. అన్ని అనుమతులను పూర్తి చేయడానికి 12 నుండి 15 నెలల సమయం పట్టవచ్చు.

"ప్రస్తుతం మా మూడు వాహనాల వ్యాపారాలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. విభజన ద్వారా, మార్కెట్‌లోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అలాగే, ఆయా విభాగాలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది." అని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు.

Also Read: చైనా ఎలక్ట్రిక్ కార్లతో గూఢచర్యం చేస్తోంది.. అమెరికా ఆరోపణలు..

​​ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు..
ముఖ్యంగా EVలు, స్వయంప్రతిపత్త వాహనాలు, వాహన సాఫ్ట్‌వేర్ రంగాలలో సినర్జీని ఉపయోగించుకోవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది. ఈ విభజన(Tata Motors Demerger) తమ ఉద్యోగులు, కస్టమర్లు, మా వ్యాపార భాగస్వాములపై ​​ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ విషయంపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ, 'ఇది మా వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. మా ఉద్యోగులు మెరుగైన వృద్ధి అవకాశాలను పొందుతారు.  మా వాటాదారుల విలువ పెరుగుతుంది.’ అని చెప్పారు. 

మూడవ త్రైమాసికంలో ₹7,100 కోట్ల లాభం..
టాటా మోటార్స్ మూడవ త్రైమాసికంలో ₹7,100 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 133% పెరిగింది. క్రితం ఏడాది కంపనీ లాభం ఇదే త్రైమాసికంలో ఇది ₹2,958 కోట్లుగా ఉంది.  క్యూ3ఎఫ్‌వై24లో కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 25% పెరిగి రూ.1,10,577 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.88,489 కోట్లుగా ఆదాయం ఉంది. 

Advertisment
తాజా కథనాలు