Paneer Bhurji : టేస్టీ పన్నీర్ భుర్జీ.. ట్రై చేయండి అదిరిపోతుంది

వెజ్ ప్రియుల మెనూలో కామన్ గా కనిపించే ఐటమ్ పన్నీర్. దీన్ని ఎక్కువగా పన్నీర్ మసాలా, పాలక్ పన్నీర్, లేదా పన్నీర్ టిక్కా లా చేసుకొని తింటుంటారు. అయితే ఈ సారి కొత్తగా, వెరైటీగా పన్నీర్ భుర్జీ ట్రై చేయండి అదిరిపోతుంది. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Paneer Bhurji : టేస్టీ పన్నీర్ భుర్జీ.. ట్రై చేయండి అదిరిపోతుంది

Paneer Curry : సహజంగా నాన్ వెజ్(Non-Veg) అంతే ఇష్టం లేని వారు ప్రోటీన్ కోసం మిల్క్, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్(Milk Based Products) ఎక్కువగా తీసుకుంటారు. వాటిలో ఒకటి పన్నీర్. అయితే పన్నీర్ అందరూ ఎక్కువగా చేసుకునే ఐటమ్స్ పన్నీర్ మసాల(Paneer Masala), పాలక్ పన్నీర్(Palak Paneer), పన్నీర్ టిక్కా(Paneer Tikka). ప్రతీ సారి ఇవే తినడం కొంత మంది బోర్ ఫీల్ అవ్వచ్చు. అందుకే ఈ సారి కొత్తగా, వెరైటీగా టేస్టీ గా పన్నీర్ భుర్జీ ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుుందాం..

పన్నీర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు

పన్నీర్- 200-250 గ్రా, 1/2 టీ స్పూన్ - పసుపు, కారం, దనియా పొడి, గరం మసాలా, ఒక కప్పు - టమోటో, అరకప్పు - ఉల్లిపాయ, ఉప్పు - సరిపడ, గ్రీన్ చిల్లీ - 2, ఆయిల్ - 3 టేబుల్ స్పూన్స్

పన్నీర్ బుర్జీ తయారు చేసే విధానం

  • ముందుగా 200-250 గ్రా పన్నీర్ తీసుకొని.. వాటిని సన్నగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
    ఆ తర్వాత ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి.
  • అవి కాస్త వేగిన తర్వాత దాంట్లో అరకప్పు ఉల్లిపాయలు వేసుకొని, అల్లం పేస్ట్, సన్నగా తరిగిన పచ్చి మిర్చి వేసి.. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి.
  • ఉల్లిపాయలు, అల్లం మిశ్రమం మంచిగా సువాసన వస్తున్న సమయంలో ఒక మెత్తటి టమోటాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్ పై టమాటాలు మెత్తగా అయ్యేవరకు వరకు ఉడికించాలి.

Paneer Bhurji

  • మిశ్రమంలో లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే సమయంలో 1/2 టీ స్పూన్ పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేసుకొని 5-6 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్ పై ఉంచాలి.
  • చివరిగా పొడి చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఎక్కువ సేపు ఉంచితే పన్నీర్ మరీ మెత్తగా అయిపోతుంది. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి, టేస్టీ పన్నీర్ బుర్జీ(Paneer Bhurji) రెడీ.

ఇది కూడా చదవండి:  పచ్చి ఉల్లిపాయలను ఇలా రాస్తే ముఖంపై మొటిమలు మాయం

Advertisment
Advertisment
తాజా కథనాలు