Paneer Samosa : సమోసా ప్రియుల కోసం అదిరిపోయే.. పన్నీర్ సమోసా రెసిపీ

పాపులర్ ఇండియన్ స్నాక్స్ లో సమోసా ఒకటి. సహజంగా అందరు ఆలు, ఆనియన్ సమోసా ఎక్కువగా తింటుంటారు. ఈ సారి కొత్తగా, వైరైటీగా పన్నీర్ సమోసా ట్రై చేయండి. దీన్ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Paneer Samosa : సమోసా ప్రియుల కోసం అదిరిపోయే.. పన్నీర్ సమోసా రెసిపీ
New Update

Paneer Samosa Recipe : ఇండియన్ స్నాక్స్(Indian Snacks) లో చాలా మందికి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ సమోసా(Samosa). ప్రతీ ఒక్కరు దీన్ని ఇష్టంగా తింటారు. సమోసాను డిఫరెంట్ స్టఫిన్గ్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిలో ఒకటి పన్నీర్ స్టఫ్ఫ్డ్ సమోసా. చాలా మంది ఆనియన్, ఆలూ సమోసా ఎక్కువగా తింటారు. ఈ సారి కొత్తగా, వైరైటీగా పన్నీర్(Paneer)  ట్రై చేయండి. దీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

పన్నీర్ సమోసా రెసిపీకీ కావాల్సిన పదార్థాలు

పన్నీర్: 200 గ్రామ్స్, ఆనియన్ : 1, ఉల్లిపాయ: 2, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లంపేస్ట్, జీలకర్ర, పసుపు, గరం మసాలా: 1/2 టీ స్పూన్, కారం: 1 టీ స్పూన్, ఉప్పు: సరిపడ, ఆయిల్ : తగినంత

పన్నీర్ సమోసా తయారీ విధానం

  • ముందుగా ఒక పాన్ తీసుకొని.. దాంట్లో ఆయిల్ వేసి కాసేపు వేడెక్కనివ్వాలి . ఆ తర్వాత జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత .. దాంట్లో అల్లం పేస్ట్, పచ్చి మిర్చి తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  • ఇప్పుడు ముందే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత పసుసు, కారం, గరం మసాలా, ఉప్పు, వేసి బాగా మిక్స్ చేసి కొన్ని నిమిషాల పాటు కుక్ చేయాలి. కాసేపు తర్వాత కుక్ అయిన మిశ్రమాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • నెక్స్ట్ పిండితో చేసిన చపాతీలను సమోసా ఆకారంలో ఫోల్డ్ చేసి.. దాంట్లో పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఎడ్జెస్ ప్రాపర్ గా క్లోజ్ చేయడం ముఖ్యం. అంతే చివరిగా వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. వేడి వేడి, యమ్మీ సమోసా రెడీ.
  • దీన్ని గ్రీన్ చట్నీ లేదా.. సాస్ తింటే అదిరిపోతుంది. పిల్లలు నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు.

Also Read : Strawberries : కీళ్ల నొప్పులు, మధుమేహ సమస్య వేదిస్తుందా.. అయితే ఈ పండు తినండి

#samosa-recipe #snack-items #paneer-samosa #paneer-samosa-recipe
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe