Tasty Rice Cutlet : బియ్యం(Rice) తో కేవలం రైస్ మాత్రమే కాదు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్(Food Items) తయారు చేసుకోవచ్చు. కాస్త వెరైటీగా ఉండడానికి రైస్ తో టమోటో, పుదీనా, పులిహోర, కొత్తిమీర, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం సహజం. ఇంట్లో పిల్లలు ఏదైనా స్పెషల్ స్నాక్ చేయాలనుకుంటే.. రైస్ కట్లెట్ బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే సింపుల్ అండ్ హెల్తీగా చేసేయొచ్చు. బయట నుంచి కాకుండా ఇంట్లోనే చేస్తే పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం..
రైస్ కట్లెట్ కు కావాల్సిన పదార్థాలు
అన్నం: ఒక కప్పు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, వెజిటేబుల్స్ (బీన్స్, క్యారెట్, పచ్చి మిర్చి, క్యాప్సికం ఇంకా ఏదైనా మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు) ఉల్లిపాయ: 1, అల్లం: 2 టేబుల్ స్పూన్స్, కారం పొడి: 1/2 టేబుల్ స్పూన్: ధనియాల పొడి: 1/2 టేబుల్ స్పూన్, బక్వీట్ పిండి: 3 టేబుల్ స్పూన్స్, నూనె: 3 టేబుల్ స్పూన్స్
తయారు చేసే విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకొని.. దానిలో అన్నం, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, మిక్స్డ్ వెజిటేబుల్స్, అల్లం, కారం, ఉప్పు, పై చెప్పిన మసాలాల(Masala) లు అన్ని వేయాలి. ఒక నూనె తప్ప
- ఆ తర్వాత ఈ అన్నంతో కూడిన ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ అయ్యేలా.. చేతితో బాగా కలపాలి. ఒకవేళ మసాలా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు.
Also Read: Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్.. ఎప్పుడైనా విన్నారా..? దీంతో మీ చర్మం మరింత యవ్వనం
- మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత.. ఇప్పుడు దాన్ని మెత్తగా స్మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దాని పై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బక్వీట్ పిండిని కాస్త వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది.
- ఇప్పుడు మెత్తగా చేసుకున్న కట్లెట్ మిశ్రమంతో గుండ్రంగా బిస్కెట్ షేప్ లో కట్లెట్స్ తయారు చేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక బాణీలో కావాల్సినంత నూనె వేసి.. కట్లెట్ బాల్స్ దాని వేయాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- అంతే సింపుల్ అండ్ ఈజీ కట్లెట్(Cutlet) రెడీ.. మరింత టెస్ట్ కోసం సాస్ లేదా గ్రీన్ చట్నీ(Green Chutney) తో తినేసేయండి. అలాగే దాని పై కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వీటిని వేడి వేడిగా పిల్లకు పెడితే ఇష్టంగా తింటారు.
Also Read: Sleeping Tips: మంచి నిద్ర కోసం సింపుల్ టిప్స్.. ఇవి పాటిస్తే హ్యాపీగా నిద్రపోతారు!