/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-15-10-jpg.webp)
Jaggery Chapathi: సహజంగా రోజూ ఏదైనా కొత్తగా స్పెషల్ తినాలని ఆశపడడం పిల్లల మనస్తత్వం. రోజూ రొటీన్ గా పూరి, దోశ, ఇడ్లీ చేస్తే వాటి పై ఇంట్రెస్ట్ పోతుంది. కొన్ని సార్లు వాటి మళ్లీ తినని పిల్లలు కూడా ఉంటారు. అందుకే అప్పుడప్పుడు పిల్లల డైట్ ఏదో ఒక వెరైటీ యాడ్ చేస్తూ ఉండాలి. కొంత మంది ఆరోగ్యం పై శ్రద్ధ ఉన్నవారు ఆయిల్ టిఫిన్స్ పక్కన పెట్టేసి ఎక్కువ చపాతీ, లేదా ఇడ్లీ పెడతారు. రోజూ చపాతీని ఒకేలా తినాలి అంతే పిల్లలు బోరింగ్ గా ఫీల్ అవుతారు. కావున ఈ సారి కొత్తగా, టేస్టీగా బెల్లం చపాతీ ట్రై చేయండి. బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచింది. ఇది పిల్లలో హీమోగ్లోబిన్ పెంచడానికి సహాయడుతుంది. బెల్లం చపాతీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
బెల్లం చపాతీకి కావాల్సిన పదార్థాలు
రెండు కప్పులు: గోధుమపిండి, ఒక కప్పు: మజ్జిగ, అర కప్పు: బెల్లం తురుము, ఉప్పు: కావల్సినంత, నెయ్యి: రెండు స్పూన్స్
తయారీ విధానం
- ముందుగా మజ్జిగ, గోధుమ పిండి, కొంచెం నెయ్యి, దాంట్లోనే చిటికెడు ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి ఒక బౌల్ లో వేసేయండి.
- ఆ తర్వాత మెత్తటి గోధుమ పిండి మిశ్రమాన్ని.. మళ్లీ ఒకసారి చేతితో మెదువుగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఆధారంగా అవసరమైతే నీళ్ళు పోసుకోవాలి.
- ఇప్పుడు దాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మెత్తగా కలుపుకున్న పిండిని గుండ్రంగా లడ్డూలు చేసుకొని.. దాన్ని చపాతీ లా రోల్ చేయాలి.
- చపాతీ లా రోల్ చేసిన తర్వాత దాని పై ముందే తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని.. దాన్ని మీకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసుకొని ఒక సారి మళ్ళీ ప్రెస్స్ చేస్తే సరిపోతుంది.
- ఆ తర్వాత తయారు చేసుకున్న బెల్లం చపాతీని.. ప్యాన్ పై కాస్త నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చాలి. అంతే సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ బెల్లం చపాతీ రెడీ. ఇది పిల్లల బ్రేక్ ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ లా కూడా ఉపయోగపడుతుంది.
Also Read: Break Fast: నూనె లేకుండా ఈ అల్పాహారం ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉంటారు