Banana Cup Cake: సహజంగా పిల్లలు బయట చేసిన ఆహారాలు, చిరు తిండ్లను తినడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తారు. వాటిలో చాక్లెట్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్ ముందుంటాయి. బయట తయారు చేసే ఈ ఆహారాలు పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు. ఎందుకంటే వాటిని ప్రిపేర్ చేసే పరిసరాలు, పదార్థాలు అపరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని పిల్లలు ఎప్పుడైనా కేక్స్ లేదా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ అడిగినప్పుడు.. ఇంట్లోనే శుభ్రంగా హెల్తీగా బననా కప్ కేక్ చేసి పెడితే సరిపోతుంది. బననా కప్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..
బననా కప్ కేక్ కావల్సిన పదార్థాలు
పండిన అరటిపండ్లు : 4, వెజిటేబుల్ ఆయిల్: 2 టేబుల్ స్పూన్స్, గుడ్లు: 2 మేపుల్ సిరప్ లేదా హానీ: 1/2 టేబుల్ స్పూన్, కాస్త నూనెలో వేయించిన ఓట్స్: 1కప్పు, బేకింగ్ సోడా: 1/2 స్పూన్
బననా కప్ కేక్ తయారీ విధానం
- ముందుగా కప్ కేక్స్ తయారీకి ఉపయోగించే మఫిన్ పాన్ తీసుకొని.. దానిని 350°F వద్ద పెట్టి వేడి చేసుకోవాలి. దీని కోసం 12 మఫిన్ పాన్ సరైనది. ఆ తర్వాత మఫిన్ కప్స్ లో నాన్ స్టిక్ గ్రీస్ ఆయిల్ స్ప్రే చేయాలి.
Also Read: Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?
- ఇక ఇప్పుడు పండిన అరటిపండ్లు, వెజిటేబుల్ ఆయిల్, గుడ్లు మేపుల్ సిరప్ లేదా హానీ, కాస్త నూనెలో వేయించిన ఓట్స్, బేకింగ్ సోడా ఒక జార్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. బ్యాటర్ స్మూత్ వచ్చే వరకు కలపాలి.
- ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న బననా కప్ కేక్ బ్యాటర్.. ముందే హీట్ చేసి పెట్టుకున్న మఫిన్ కప్స్ లో ఫిల్ చేయాలి. ఒక కప్పులో 3/4 మాత్రమే ఫిల్ చేయాలి.
- మఫిన్ కప్స్ లో బ్యాటర్ ఫిల్ చేసిన తర్వాత.. చిన్న చిన్నగా రౌండ్ షేప్ కట్ చేసిన బననా ముక్కలతో గార్నిష్ చేయాలి. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ తో పాటు ఆకర్షణీయంగా కూడా కనిపించేలా చేస్తుంది.
- ఇప్పుడు వాటిని ఒక 15 నిమిషాల పాటు ఓవెన్ లో ఉంచాలి. బ్యాటర్ కుక్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి టూత్ పిక్ తో టెస్ట్ చేయండి. ఇది ఒక ట్రిక్.. టూత్ పిక్ కేక్ లోపలికి పెట్టినప్పుడు పిండి స్టిక్ అవ్వకపోతే కేక్ కుక్ అయినట్లు తెలుస్తుంది.
- కుక్ అయిన తరువాత వాటిని వెంటనే వేరే ప్లేట్ లోకి సర్వ్ చేయకూడదు. పది నిమిషాల పాటు అలాగే ఉంచి.. మఫిన్స్ కూల్ అయ్యాక బయటకు తీయాలి. అంతే సింపుల్ అండ్ టేస్టీ బననా కప్ కేక్ రెడీ. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.
Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!