Worst Foods: ప్రపంచంలో టాప్-10 చెత్త ఫుడ్ ఐటెమ్స్.. లిస్ట్‌లో భారతీయ వంటకాలు కూడా! టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 చెత్త ఆహారాల ర్యాకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన డిషెస్ ఉన్నాయి. అందులో ఇండియన్ డిష్ కూడా ఉంది పంజాబ్ కు చెందిన ఆలూ బైంగన్ ఈ జాబితాలో నిలిచిన ఏకైక ఇండియన్ రెసిపీ గా 60 స్థానంలో ఉంది. By Archana 08 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Worst Foods: టేస్ట్ అట్లాస్ అనేది ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన ఒక ఆన్లైన్ ట్రావెల్ గైడ్. ఇది ప్రామాణికమైన డిషెస్, ఫుడ్ క్రిటిక్స్ రివ్యూస్, పాపులర్ ఇంగ్రిడియంట్స్, బెస్ట్ డిషెస్ కు సంబంధిచిన పూర్తి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. సాంప్రదాయ వంటకాలు, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్స్, గురించి పూర్తి పరిశోధనలు టేస్ట్ అట్లాస్ ట్రావెల్ గైడ్ లో ఉంటాయి. టేస్ట్ అట్లాస్ ప్రతీ సంవత్సరం బెస్ట్, వర్స్ట్ డిషెస్ జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ ఇయర్ కూడా ప్రపంచంలో టాప్ 100 వంటకాల ర్యాకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. ఈ చెత్త ఆహారాల జాబితాలో ఇండియాకు చెందిన డిష్ కూడా ఉంది. ఈ చెత్త ఆహారాల జాబితాలో బాటమ్ 10 డిషెస్ ఇవే.. ఆలూ బైంగన్ ఇది ఒక ఇండియన్ డిష్. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆలూ బైంగన్ చెత్త ఆహారాల జాబితాలో నిలిచినా ఏకైక భారతీయ వంటకంగా 2.7 రేటింగ్ తో 60 వ స్థానంలో నిలిచింది. ఆలూ, వంకాయను కలిపి ఈ రెసిపీ తయారు చేస్తారు. బోకడిల్లో డీ కార్నేడీ కాబేల్లో ఇది స్పెయిన్ దేశానికి చెందిన డిష్. ఇది హార్స్ మీట్ తో తయారు చేసే శాండ్విచ్. చెత్త ఆహారాల జాబితాలో 2. 3 రేటింగ్ కలిగి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. మర్మిటే అండ్ చిప్ శాండ్విచ్ డిష్ తొమ్మిదవ స్థానంలో ఉంది. కాల్‌స్క్రోవ్ కాల్‌స్క్రోవ్ స్వీడన్ దేశానికి చెందిన డిష్. ఈ స్వీడిష్ వంటకంలో హాంబర్గర్‌లతో నింపబడిన కాల్జోన్ పిజ్జా ఉంటుంది. రాత్రి పూట ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హాంబర్గర్లు, పిజ్జా రెండింటినీ ఎంపిక చేసుకునే వారి కోసం కొన్ని సంవత్సరాల క్రితం స్వీడిష్ అనే ప్రాంతంలో ఈ డిష్ ను కనిపెట్టారు. ఈ డిష్ 2.2 రెంటింగ్ తో ఏడవ స్థానంలో ఉంది. Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి చాపలే చాపలే ఇది చిలీ దేశానికి చెందిన డిష్. ఈ వంటకాన్ని బంగాళాదుంపల తురుము, పిండి, ఉప్పు తో తయారు చేస్తారు. ఈ డిష్ 2.2 రెంటింగ్ తో ఆరవ స్థానంలో ఉంది. Chiloé Archipelago ప్రాంతంలో ఈ డిష్ బాగా పాపులర్. స్క్లెన్ద్రసిస్ (Sklandrausis) ఈ డిష్ లాట్వియా దేశానికి చెందింది. ఇది రై పిండితో తయారు చేయబడిన ఒక స్వీట్ పేస్ట్రీ. ఈ డిష్ చెత్త ఆహారాల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. కాల్వ్సిల్టా కాల్వ్సిల్టా ఇది స్వీడన్ దేశానికి చెందిన డిష్. ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో కేవలం 2.2 రేటింగ్ తో నాలుగవ స్థానంలో నిలిచింది. యెరుషల్మీ కుగెల్ ఈ డిష్ ఇజ్రాయెల్ దేశానికి చెందినది. అత్యంత చెత్త ఆహారాల జాబితాలో ఇది 2. 0 రేటింగ్ తో మూడవ స్థానంలో ఉంది. రామన్ బర్గర్ రామన్ బర్గర్ న్యూ యార్క్ కు చెందిన డిష్. న్యూ యార్క్ సిటీలో ఇది బాగా పాపులర్. కానీ కేవలం 1.9 రేటింగ్ తో రెండవ స్థానంలో ఉంది. హ్యకరల్ ఇది ఐర్లాండ్ కు చెందిన డిష్. ఈ వంటకం షార్క్ మీట్ తో తయారు చేయబడుతుంది. చెత్త ఆహారాల జాబితాలో కేవలం 1. 8 రెటింగ్ తో ఇది మొదటి స్థానంలో నిలిచింది. Also Read: Orange Peel Benefits : ఏంటీ.. నారింజ తొక్కలను పడేస్తున్నారా..? అయితే మీ అందం గురించి మర్చిపోండి #top-10-worst-foods-by-taste-atlas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి