తమిళనాట (Kollywood) స్టార్ హీరోలకు నిర్మాతల మండలి(Producers commitee)పెద్ద షాక్ ఇచ్చింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోలుగా పేరొందిన నలుగురు హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్ (Red Card) జారీ చేసింది. సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ల(Producers)ను ఇబ్బందులకు గురి చేశారన్న విషయం పై వీరితో ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
రెడ్ కార్డ్ అందుకున్న హీరోలు ఎవరంటే శింబు(Simbu), విశాల్(Vishal), ధనుష్(Dhanush)అధర్వ(Adharva),. నిర్మాత మైఖేల్ రాయప్పన్ తో ఏర్పడిన వివాదాల కారణంగా శింబు రెడ్ కార్డును అందుకోనున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి ఎన్నోసార్లు శింబుతో చర్చలు జరిపినప్పటికీ కూడా శింబు నుంచి ఎలాంటి సమాధానం లేదు.
దీంతో శింబుకు రెడ్ కార్డ్ అందజేయనున్నట్లు తెలిపింది. మదియలకన్ నిర్మాణ సంస్థతో హీరో అథర్వ ఓ చిత్రానికి ఓకే చెప్పారు. కానీ తీరా షూటింగ్ మొదలు పెట్టే సమయానికి మాత్రం ఆయన రాలేదు. దీంతో ఆయనకు రెడ్ కార్డు వస్తోంది. ఇక తమిళ నాట ప్రముఖ హీరో ధనుష్ ఓ చిత్రానికి తెనందాల్ సంస్థలో సంతకం చేశారు.
సుమారు 80 శాతం చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. అయితే ఆ తరువాత నుంచి ఆయన షూటింగ్ కు రావడం మానేయడంతో పాటు..ఆ నిర్మాణ సంస్థకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. దీంతో ఆయనకు కూడా రెడ్ కార్డ్ ఇష్యూ అవ్వనుంది. ఇక విశాల్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో విశాల్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణల మీద రెడ్ కార్డు అందుకోనున్నారు.
అయితే ఈ రెడ్ కార్డు వల్ల అటు శింబు కి కానీ, ఇటు అథర్వ్ కికానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం విశాల్ ధనుష్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ కూడా మంచి ఫాలోయింగ్ హీరోలు. అంతే కాకుండా శుక్రవారం విశాల్ నటిస్తున్న చిత్రం మార్క్ ఆంటోని విడుదల కాబోతుంది.
ఇలాంటి సమయంలో విశాల్ కి రెడ్ కార్డు అంటే విశాల్ కి ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు నలుగురు హీరోలు స్పందించలేదు. వారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.