Tamil Hero VijayKanth : తమిళ నటుడు విజయ కాంత్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ సినిమాల్లో గొప్ప నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు విజయ్ కాంత్. సినిమా రంగంలో నటుడుగా మాత్రమే కాదు నిర్మాత, దర్శకునిగా కూడా మంచి గుర్తింపు పొందారు. 1991లో 100 వ చిత్రం "కెప్టెన్ ప్రభాకరన్" సినిమాతో విజయ కాంత్ ను కెప్టెన్ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. 40 ఏళ్ళ సినీ జీవితంలో 100 కు పైగా సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా ప్రేక్షకుల ఆదరణను పొందారు.
సినిమాల్లో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయ కాంత్.. 2005 లో DMDK పార్టీనీ స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. సినిమా, రాజకీయ రంగంలో రాణించిన విజయ్ కాంత్ ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని సమాచారం.
Also Read: కొత్త పార్టీ పెట్టిన హీరో నాని.. మేనిఫెస్టో వీడియో వైరల్
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ చెన్నై లోని మయత్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చాలా కాలం నుంచి మధుమేహ సమస్య తో బాధపడుతున్న కారణంగా.. అయన కాలి వేళ్ళకు రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు విజయ్ కాంత్ కాలి వేళ్ళను తొలగించారు. అంతే కాదు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం కాస్త క్షీణించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం.
Also Read: Miss Universe 2023: విశ్వసుందరి పోటీల్లో బ్యూటీల అందాలు విందు.. పిచ్చెక్కించే ఫొటొలివే!