/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/vijay-jpg.webp)
Tamil Hero Vijay Political Entry: గత కొంతకాలంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ తన ఫ్యాన్స్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేశారు. అయితే, ఈ వార్తలపై హీరో విజయ్ ఏ మాత్రం స్పందించలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుండటంతో అతడి పొలిటికల్ ఎంట్రీ పై పెద్ద సస్పెన్స్ నెలకుంది. అయితే, తాజాగా ఈ విషయంపై అందరికి కార్లిటీ ఇచ్చారు స్టార్ హీరో విజయ్. సోషల్ మీడియాలో స్పందిస్తూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) పేరిట ఒక కొత్త పార్టీని ప్రకటించి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#தமிழகவெற்றிகழகம்#TVKVijayhttps://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024
పార్టీ జెండా, అజెండా త్వరలో ప్రకటిస్తానంటూ విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని..అవినీతి నిర్మూలన కోసమే తన ప్రయత్నం అని పోస్ట్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని స్పష్టం చేశారు. అయితే, ఈ పార్టీ ప్రకటన ఇప్పుడు తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సంచనలంగా మారింది. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మంచి చేస్తూ వస్తున్నారు. స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్ ఇవ్వడం, ఇటీవల వచ్చిన వరద బాధితులకు సహాయం చేయడం వంటి పనులు చేశారు.
Also Read: తిరుమలలో మంత్రి రోజాకి రాజధాని సెగ.. జై అమరావతి అంటూ నినాదాలు..!
అయితే, నటుడిగా ఎంతో స్టార్ డం తెచ్చుకున్న హీరో విజయ్ పొలిటికల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే. ఆయన పొలిటికల్ ఎంట్రీపై తన అభిమానులు పెద్ద పండుగ చేసుకుంటున్నారు. బాణసంచాలు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు పలువురి స్టార్ హీరోలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఆల్ ది బెస్ట్ చెబుతూ విషెస్ తెలుపుతున్నారు.