Konaseema Arson Case: మంత్రి విశ్వరూప్ తనయుడికి నిరసన సెగ.. అల్లర్లలో అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం!!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు. తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించారు.. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానిక మహిళలు, యువత శ్రీకాంత్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.