West Bengal : భారీ పేలుడు...8 మంది దుర్మరణం..!!
పశ్చిమ బెంగాల్లో భారీ పేలుడు సంభవించింది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని దత్పుకూర్ ప్రాంతంలోని అక్రమ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. మజ్పూర్ జగన్నాథ్‌పూర్ సమీపంలోని ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్యలో బాణాసంచా తయారీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు.